సునీల్ డైరెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా?

sunil
sunil

మనం కామెడీయాన్ గా కెరీయర్ని స్టార్ట్ చేసిన స్టార్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ మూవీ హిట్ అయింది. మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాతో సూపర్ సక్సెస్ నీ తన ఖాతాలో వేసుకున్నాడు.

వెంటనే పూలరంగడు మూవీ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇలా వరుస హిట్స్ తో సునీల్ హీరోగా మారిపోయాడు. కమెడియన్ వేషాలు పక్కన పెట్టి పూర్తిస్థాయిలో కమర్షియల్ హీరోగా నిలబడాలని ప్రయత్నం చేశాడు. 2011 నుంచి 2018 వరకు హీరో గానే మూవీస్ చేస్తూ వచ్చారు. వీటిలో కొన్ని ఏవరేజ్ టాక్ ట్ తెచ్చుకోగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.

అయితే హీరోగా రొటీన్ ఒకే తరహా కథలతో విసిపోయి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ టర్న్ తీసుకున్నారు. అరవింద సమేత సినిమాలో కీలక పాత్రలో కనిపించారు.పుష్ప సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించిన సునీల్ పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోయాడు.తెలుగు మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

శివకార్తికేయన్ మావీరన్ మూవీలో నటించిన సునీల్ తాజాగా జైలర్ లో ఓ కీలక పాత్రలో కనిపించారు. కార్తీ జపాన్, విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా నటిస్తున్నాడు.తెలుగులో గేమ్ చేంజర్ పుష్ప 2 కు చిత్రాలలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే సునీల్ ని ఇప్పటి వరకు అందరూ యాక్టర్ గానే చూశారు.

తెలుగులో గేమ్ చేంజర్ పుష్ప 2 కు చిత్రాలలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.. డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టి ఒక మూవీ కూడా సునీల్ చేశారంట. అతని కెరియర్లో అబౌట్ యావరేజ్ నిలిచిన చిత్రాల్లో జక్కన్న ఒకటి. ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీని ఆవిష్కరించారు. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

అయితే కథకుడిగా అతను బాగానే ఉన్నా డైరెక్షన్ పరంగా అనుభవం లేకపోవడంతో చాలా సీన్స్ ఆశించిన స్థాయిలో రాలేదంట. దీంతో సునీల్ డైరెక్టర్ గా మారి మూవీని కంప్లీట్ చేసారంట. కానీ క్రెడిట్ మాత్రం వంశీకృష్ణ ఆకెళ్ళకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా కెరియర్ లో తన సినిమాని తానే డైరెక్ట్ చేసుకొని ఆ కోరిక కూడా సునీల్ తీర్చుకున్నారు.