రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షెడ్యూల్ అప్ డేట్

Ram Charan's 'Game Changer' schedule update
Ram Charan's 'Game Changer' schedule update

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ని శంకర్ తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది . ఇక ఈ సినిమా లో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి తిరు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, కొన్నాళ్లుగా వైజాగ్ లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ నేటితో పూర్తి కాగా. రెండు రోజుల గ్యాప్ తర్వాత, అనగా 21న హైదరాబాద్ నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుందట. ఇక ఈ షెడ్యూల్ లో టాకీపార్ట్ చాలావరకు ఫినిష్ అవుతుందని, దీని తర్వాత బుచ్చి బాబు సన తెరకెక్కించనున్న RC16 సినిమా వర్క్ తో బిజీ అవుతారట రామ్ చరణ్.