Sports: ఫుట్బాల్ ఆడుతున్న రన్ మెషీన్, మాక్స్ వెల్

Sports: Running machine playing football, Maxwell
Sports: Running machine playing football, Maxwell

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తోందంటే క్రికెట్ లవర్స్ కి పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతోంది. ఈక్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆటగళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లి, మాక్స్ వెల్ ఫుట్బాల్ ఆడుతూ సరదాగా గడిపారు. ఉమెన్స్ జట్టు కప్ గెలవగా.. అదే ఊపులో మెన్స్ టీమ్ కూడా 16 ఏళ్ల కలను నెరవేరుస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఐపీఎల్ 16 సీజన్లలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, జహీర్ ఖాన్, డేల్ స్టెయిన్ వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు చేయలేనిది.. స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం రెండు సీజన్లలోనే చేసి చూపించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రెండవ సీజన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్వరూప స్కోరుకే పరిమితం చేసి… ఆ తర్వాత జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదించేసి 8 వికెట్లతో బెంగళూరు గెలిచింది.