రోజాలో కొత్త భ‌యం

roja-interesting-post-on-jagan-in-facebook

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల ఉప ఎన్నిక‌లో వైసీపీ ఓట‌మికి రోజా ఐరెన్‌లెగ్గే కార‌ణ‌మంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో రోజాకు ఏదో భ‌యం ప‌ట్టుకున్న‌ట్టుంది. ఉప ఎన్నిక ఫ‌లితం విడుద‌ల‌యిన మ‌రుక్ష‌ణం నుంచి ఆమె జ‌గ‌న్ పై వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. జ‌గ‌న్ చాలా మంచి వ్య‌క్తి అని ప‌దే ప‌దే చెబుతోన్న రోజా తాజాగా త‌న ఫేస్ బుక్ వాల్ లో ఓ పోస్ట్ చేశారు. జ‌గ‌న్ చాలా మంచి వ్య‌క్తి అన్న‌ది ఆ పోస్ట్ సారాంశం. జ‌గ‌న్ గురించి ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక అభిప్రాయాలు త‌ప్ప‌ని, ఆ అభిప్రాయాల‌ను ప్ర‌జ‌ల్లో చొప్పించింది టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సంబంధించిన టీవీ చానెళ్లు,ప‌త్రిక‌లే అని రోజా ఆరోపించారు. జ‌గ‌న్ ని ఓ దుర్మార్గుడిగా, అవినీతి ప‌రుడిగా ఆ చానెల్స్ చూపించాయ‌ని, అది నిజం కాద‌ని రోజా రాసుకొచ్చారు. త‌న ఫేస్ బుక్ ఫాలోవ‌ర్ల‌లో రాజ‌కీయాల‌కు సంబంధం లేని వేలాది మందిఉన్నార‌ని, వారి కోసం జ‌గ‌న్ గురించికొన్ని విష‌యాలు చెబుతున్నాన‌ని రోజా వివ‌రించారు.

జ‌గ‌న్ ఒక విష‌యాన్ని విశ్లేషించి నిర్ణ‌యానికి వ‌చ్చాక ప్రాణం పోతుంది అనుకున్నా మడం తిప్ప‌డ‌ట‌. వైఎస్ ను అభిమానించే వేలాదిమంది కోసం సోనియాను ఎదురించి జైలు శిక్ష అనుభ‌వించాడ‌ట‌. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ఓడిపోతామ‌ని తెలిసినా..మాట త‌ప్ప‌కూడ‌ద‌న్న నియ‌మంతో అభ్య‌ర్థుల‌ను మార్చ‌లేద‌ట‌. భార‌త‌దేశంలో ముంద‌స్తు ప‌న్నుచెల్లించిన ఏకైక వ్య‌క్తి జ‌గ‌నే అట‌..ఇలా త‌మ పార్టీ అధినేత‌ను పొగుడూతూ రోజా త‌న ఫేస్ బుక్ వాల్ లోచాలా విష‌యాలే రాసుకొచ్చారు. అయితే రోజాకు ఇప్పుడు ఈ విష‌యాలన్నీ చెబుతూ జ‌గ‌న్ ను పొగ‌డాల్సిన అవ‌స‌ర‌మేముంద‌ని అంద‌రికీ సందేహ‌మొస్తోంది. నంద్యాల ఫ‌లితం త‌ర్వాత రోజా ఐరెన్ లెగ్ వ‌ల్లే వైసీపీ ఓడిపోయింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో….ఆ సెంటిమెంటును న‌మ్మి జ‌గ‌న్ త‌న‌ను ఎక్క‌డ దూరం పెడ‌తారో అని రోజాలో భ‌యం మొద‌ల‌యింద‌ని, అందుకే ఆమె అదేప‌నిగా జ‌గ‌న్ ను పొగుడుతోంద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. రోజా చేస్తున్న వ్యాఖ్య‌లు చేస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. రోజా భ‌యం సంగ‌తేమో కానీ..జ‌గ‌న్ ను పొగిడే ప‌నిలో భాగంగా ఆమె త‌న‌కు తెలియ‌కుండానే ఓ నిజాన్ని మాత్రం ఒప్పుకున్నారు. జ‌గ‌న్ పైనా, ఆయ‌న అవినీతిపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందన‌టం ద్వారా… రాష్ట్రంలో వైసీపీ ప‌రిస్థితి ఏమిటో్ అంద‌రికీ వివ‌రించారు.

మరిన్ని వార్తలు:

నేనే జ‌య‌ల‌లిత కూతుర్ని

పరిటాల రవి బర్త్ డే స్పెషల్ స్టోరీ…

అమృత అమ్మకే పుట్టిందట.