బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎన్టీఆర్‌?

junior-ntr-entiring-in-to-bigg-boss-house-for-jai-lava-kusa-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ షోకు ప్రతి వారం ఆయన వెళ్తునే ఉన్నాడు కదా, మళ్లీ ప్రత్యేకంగా ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా. ప్రతి వారం బిగ్‌బాస్‌ షోకు ఎన్టీఆర్‌ వస్తున్నాడు తప్ప, బిగ్‌బాస్‌ ఇంటికి మాత్రం వెళ్లడం లేదు. ఆ ఇంట్లోకి పంపించడం లేదా తీసుకు రావడమే ఎన్టీఆర్‌ పని, అంతే తప్ప ఎన్టీఆర్‌ ఆ ఇంట్లోకి వెళ్లడు. షో ప్రారంభం అయిన రోజు అసలు బిగ్‌బాస్‌ హౌస్‌ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులకు చూపించేందుకు ఎన్టీఆర్‌ లోనికి వెళ్లాడు. అప్పటి నుండి మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎన్టీఆర్‌ వెళ్లింది లేదు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. 

బిగ్‌బాస్‌కు వచ్చిన ప్రేక్షకాధరణ నేపథ్యంలో సినిమాల ప్రమోషన్‌ కోసం ఇప్పటికే రానా, తాప్సి, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్స్‌ వాడేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా జై లవకుశ చిత్రం కోసం ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లబోతున్నాడు. ఎన్టీఆర్‌తో పాటు, చిత్ర నిర్మాత అయిన కళ్యాణ్‌ రామ్‌ లేదా హీరోయిన్‌ బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా వెళ్లడి చేయలేదు. కాని సినిమా విడుదలకు ముందు వారం ఖచ్చితంగా ఎన్టీఆర్‌ అండ్‌ టీం బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు టీజర్‌లు దుమ్ము రేపుతున్నాయి. సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు:

బాహుబ‌లిక‌న్నా గొప్ప‌గా ఉంటుంది

లెజెండ‌రీ మామ‌య్య‌, అంద‌మైన కొడుకు

తాప్సి తెలివైన నిర్ణయం.. రెండున్నర కోట్ల లాభం

బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎన్టీఆర్‌? - Telugu Bullet