త్రివిక్రమ్‌ మూవీని మొదలు పెట్టిన ఎన్టీఆర్‌!

Jr NTR to team up with Trivikram Srinivas for his next.

Posted August 12, 2017 at 15:20 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రాన్ని చేస్తున్నాడు. అప్పుడే త్రివిక్రమ్‌ సినిమాను ఎలా మొదలు పెట్టాడా అని ఆశ్చర్యపోతున్నారా.. మొదలు పెట్టడం అంటే షూటింగ్‌ మొదలు పెట్టడం కాదలేండి.. త్రివిక్రమ్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌ అప్పుడే వర్కౌట్‌లు మొదలు పెట్టాడు. ‘జై లవకుశ’ చిత్రం కోసం ఎన్టీఆర్‌ సాదారణం కంటే నాలుగు అయిదు కేజీలు పెరగడం జరిగింది. ఆ సినిమాలో పాత్రల కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్‌ ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమా కోసం దాదాపు పది కేజీలు తగ్గాల్సి ఉందట. ఒక వైపు ‘జై లవకుశ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డ ఎన్టీఆర్‌, మరో వైపు తన బరువును కూడా తగ్గించుకునేందుకు వర్కౌట్‌లు ప్రారంభించాడు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ హీరోగా సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. మొదటి నుండి కూడా ఎన్టీఆర్‌తో సినిమాను ఈ సంవత్సరంలో ప్రారంభించి వచ్చే సంవత్సరం వేసవి చివర్లో లేదా దసరా కానుకగా విడుదల చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్లానింగ్‌ జరుగుతుంది. ఇప్పటికే కథ పూర్తి అయ్యింది. స్క్రిప్ట్‌ వర్క్‌ను 20 రోజుల్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఇక సినిమాను వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభం అయ్యే ఛాన్స్‌ ఉంది. ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్‌ మూవీలో కొత్తగా చూస్తామా అని ఫ్యాన్స్‌ ఇప్పటి నుండే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

నా క‌ల నెర‌వేరింది

సోషల్‌ మీడియాలో ‘స్పైడర్‌’కు వ్యతిరేక ప్రచారం

SHARE