ముగ్గురిలో పై చేయి సాధించింది ఎవరు?

rana nene raju nene mantri better than lie and jai janaki nayaka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రతి శుక్రవారం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కొత్త సినిమాల సందడి సర్వ సాదారణం. కొత్త సినిమాలతో ప్రతి వారం థియేటర్లు కలకళలాడుతూ ఉంటాయి. పెద్ద సినిమాలు అయితే ఒకటి లేదా రెండు, చిన్ని సినిమాలు అయితే లెక్కకు మించి ఒక వారం విడుదల అవుతూ ఉంటాయి. అయితే చాలా కాలం తర్వాత మూడు పెద్ద సినిమాలు ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జయ జానకి నాయక’ మరియు ‘లై’ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకమైన స్థానంను దక్కించుకున్నాయి. అయితే విడుదల తర్వాత మిగిలిన రెండు చిత్రాలతో పోల్చితే ‘లై’ చిత్రం పోటీలో లేకుండా పోయింది. 

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లై’ చిత్రంలో నితిన్‌ పూర్తి విభిన్నంగా కనిపించడంతో పాటు, టీజర్‌ మరియు ట్రైలర్‌లు ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా బాగుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వ్యక్తం అయ్యింది. కాని సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇక మిగిలిన రెండు చిత్రాల్లో జయ జానకి నాయక చిత్రం మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే హీరోకు అంతగా గుర్తింపు లేకపోవడంతో పాటు, ఆయన యాక్టింగ్‌ సరిగా చేయలేకపోయాడు అనే బ్యాడ్‌ టాక్‌ వస్తుంది. ఇక మూడవ చిత్రం అయిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు మాస్‌ మరియు క్లాస్‌ ఆడియన్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది. రానా నటనతో పాటు దర్శకుడు తేజ నడిపిన పొలిటికల్‌ డ్రామా ఆకట్టుకునే విధంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో రానాదే పై చేయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు:

తల్లి పాత్ర‌లో స్టార్ హీరోయిన్

సోషల్‌ మీడియాలో ‘స్పైడర్‌’కు వ్యతిరేక ప్రచారం