ఫిదా’కు భానుమతి పారితోషికం ఎంతో తెలుసా?

Fidaa Sai Pallavi Fidaa Movie Shocking Remuneration

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి ‘ప్రేమమ్‌’ చిత్రంతో అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన తర్వాత కూడా ఆమె నటించిన సినిమాలకు 15 నుండి 25 లక్షల పారితోషికం మాత్రమే అందుకుంది. తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం ‘ఫిదా’కు కూడా ఈమె 20 లక్షల పారితోషికాన్ని అందుకోవడం జరిగింది. సినిమాకు మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు, భారీగా వసూళ్లు వచ్చిన నేపథ్యంలో మరో 15 లక్షలు అదనంగా సాయి పల్లవికి నిర్మాత దిల్‌రాజు ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటి సినిమాకు 20 లక్షల పారితోషికం తీసుకున్న సాయి పల్లవి రెండవ సినిమాతోనే 70 లక్షలను అందుకుంటుంది.

ఇదే దిల్‌రాజు తాజాగా నానితో నిర్మిస్తున్న సినిమాకు సాయి పల్లవికి 70 లక్షల రూపాయలు ఇచ్చి మరీ హీరోయిన్‌గా బుక్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా సాయి పల్లవి దిల్‌రాజు బ్యానర్‌లోనే చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఆ సినిమాలకు కోటి వరకు పారితోషికం అందుకునే అవకాశాలున్నాయి. ఇక ఇప్పుడే సాయి పల్లవికి పలువురు నిర్మాతలకు కోటికి పైగా పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. సాయి పల్లవి భవిష్యత్తులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో నానితో కలిసి సాయి పల్లవి మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

మరిన్ని వార్తలు:

చై, సామ్‌ లగ్న పత్రికలో ఆసక్తికర విషయం

అక్కడ రానాకు అన్యాయం జరిగింది

నా క‌ల నెర‌వేరింది