అక్కడ రానాకు అన్యాయం జరిగింది

No Theaters For Nene Raju Nene Mantri In Tamilnadu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రానా, కాజల్‌ జంటగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేశారు. రానా మరియు కాజల్‌లకు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా కాజల్‌ తమిళనాట స్టార్‌ హీరోయిన్‌గా పరిచయం ఉంది. అందుకే తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇదే రోజు సినిమాను విడుదల చేయాలని నిర్మాత సురేష్‌బాబు భావించాడు. కాని అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్లుగా సినిమా విడుదల జరగలేదు.

తమిళంలో నేడు ధనుష్‌ నటించిన ‘వీఐపీ 2’ చిత్రం భారీగా విడుదలైంది. ఈ నేపథ్యంలో అక్కడ తమిళ థియేటర్‌ యాజమాన్యం వారు రానా సినిమాకు థియేటర్స్‌ లభించకుండా చేశారు. అన్ని థియేటర్లలో వీఐపీ 2 చిత్రాన్ని వేయడం జరిగింది. తెలుగులో వీఐపీ 2 చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకున్నారనే నెపంతో కొందరు రానా సినిమాకు అన్యాయం చేశారు. ఈ వారం విడుదల కాలేక పోయిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తమిళ డబ్బింగ్‌ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామంటూ తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ను తీసుకున్న నిర్మాత పేర్కొన్నాడు. తమిళంలో ఖచ్చితంగా రానా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

మరిన్ని వార్తలు:

ఓపెనింగ్స్‌ నా వల్ల కాదంటున్న ‘ఫిదా’ బ్యూటీ

స్పైడర్‌’ హిందీలో లేదు

‘నిజం’గా సీక్వెల్‌ చేస్తాడా?