చై, సామ్‌ లగ్న పత్రికలో ఆసక్తికర విషయం

chaitanya-wedding-card-with-is-monthers-name-lakshmi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగచైతన్య, సమంతల వివాహంకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్టోబర్‌లో వీరి వివాహంకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెల్సిందే. పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి అనేందుకు నిదర్శణంగా ఈ పెళ్లికి సంబంధించిన లగ్న పత్రిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. నాగచైతన్య తరపు లగ్న పత్రికను స్వయంగా నాగార్జున తయారు చేయించినట్లుగా తెలుస్తోంది. ఆ లగ్న పత్రికలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 

నాగచైతన్య, సమంతల వివాహ ఆహ్వాన పత్రిక మొత్తం ఇంగ్లీష్‌లో ఉంది. పత్రిక మొదట్లో స్వర్గీయ అన్నపూర్ణ మరియు నాగేశ్వరరావుల దీవెనలు మరియు స్వర్గీయ రామానాయుడు దీవెనలతో ఆహ్వాన పత్రిక అంటూ వేయడం జరిగింది. నాగచైతన్య ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన వారసుడు కనుక నాగేశ్వరరావు, రామానాయుడు పేర్లను వేయడం జరిగింది. ఇక పత్రిక క్రింది భాగంలో నాగార్జున మరియు అమల పేర్లు వేశారు. ఇక నాగచైతన్య తల్లి అయిన లక్ష్మి పేరును కూడా ఆమె భర్త పేరుతో కలిపి వేయడం జరిగింది. అంటే నాగచైతన్య వివాహ పత్రికలో పూర్తిగా న్యాయం చేశారు. తల్లి తరపు, తండ్రి తరపు వారిని వదిలి పెట్టకుండా మొత్తం అందరిని కవర్‌ చేశారు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

నేనే రాజు నేనే మంత్రి మూవీ తెలుగు బులెట్ రివ్యూ…