స్పైడర్‌’ హిందీలో లేదు

mahesh-babu-spyder-movie-is-not-in-hindi-version

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదటి నుండి తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. హిందీ వర్షన్‌కు మహేష్‌బాబు పాత్రకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ లేదా మరో స్టార్‌ హీరో డబ్బింగ్‌ చెప్పే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని మురుగదాస్‌ చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబు ఈ సినిమాతో బాలీవుడ్‌లో అలరించడం ఖాయం అని ఫ్యాన్స్‌ భావించారు. కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయడం లేదని తేల్చి చెప్పారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘స్పైడర్‌’ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్‌ చేసే ఆలోచనను మురుగదాస్‌ వెనక్కు తీసుకున్నాడు. కారణం తెలుగులో ఈ సినిమా సక్సెస్‌ అయితే హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌కు ఇప్పటికే ‘స్పైడర్‌’ చిత్ర కథను చెప్పడం జరిగింది. కొన్ని మార్పులతో హిందీలో కాస్త ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడం పెద్ద పనేం కాదు అంటూ మురుగదాస్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సక్సెస్‌లు అందుకున్న మురుగదాస్‌ స్పైడర్‌తో కూడా బాలీవుడ్‌లో డైరెక్ట్‌గా సక్సెస్‌ను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

బిగ్‌బాస్‌లో మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ

షారుఖ్‌ సినిమాలో రజినీకాంత్‌, ప్రభాస్‌?

నేనే రాజు నేనే మంత్రి’ ప్రేక్షకుల స్పందన