బిగ్‌బాస్‌లో మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ

Hot Actress To Join Bigg Boss Telugu As Wild Card Entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకుల విశేష ఆధరణ పొందుతున్న బిగ్‌బాస్‌ తెలుగులో మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే మూడు వారాల తర్వాత హాట్‌ బ్యూటీ దీక్షాపంత్‌ను బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇక తాజాగా మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని వచ్చే వారంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు మరో హాట్‌ బ్యూటీని రంగంలోకి దించాలని స్టార్‌ మాటీవీ వారు భావిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలతో చర్చు జరిపినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఒక హీరోయిన్‌ను ఫైనల్‌ చేసి, వచ్చే వారంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే షో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సమయంలో మరో పార్టిసిపెంట్‌ను, అది కూడా ఒక హాట్‌ హీరోయిన్‌ను హౌస్‌లో జాయిన్‌ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రేక్షకులు మరింతగా షోను ఆధరించడం ఖాయంగా కనిపిస్తుంది. బిగ్‌బాస్‌ షో కారణంగా స్టార్‌ మాటీవీ గత మూడు వారాలుగా నెం.1 స్థానంలో దూసుకు పోతుంది. దేశంలోనే అత్యధికులు చూస్తున్న షోగా కూడా బిగ్‌బాస్‌ రికార్డు సాధించింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయడంతో పాటు, పార్టిసిపెంట్స్‌ చేస్తున్న టాస్క్‌లు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ బ్యాడ్‌ న్యూస్‌

నిజం’గా సీక్వెల్‌ చేస్తాడా?