షారుఖ్‌ సినిమాలో రజినీకాంత్‌, ప్రభాస్‌?

super-star-rajinikanth-and-rebel-star-prabhas-in-shahrukhs-film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ టైం ఏమాత్రం బాగున్నట్లుగా లేదు. బాలీవుడ్‌కా బాద్‌షాగా పేరు తెచ్చుకుని, బాక్సాఫీస్‌ కి దాదా అంటూ పిలిపించుకున్న షారుఖ్‌ ప్రస్తుతం మినిమం సక్సెస్‌ కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఈయన చేసినే ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన పాపన పోలేదు. ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా కూడా తన పనేంటో తాను చూసుకుంటూ, తన సినిమాల ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజెల్‌’ అనే చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా నుండి తేరుకుని కొత్త సినిమా పనిలో షారుఖ్‌ పడిపోయాడు. 

పలు సక్సెస్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ తర్వాత సినిమా ఉండబోతుంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఈ చిత్రంతో అయినా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయాలని షారుఖ్‌ ఖాన్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో తనతో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మరియు సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, టాలీవుడ్‌ న్యూ సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌లను నటింపజేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ముగ్గురు సినిమాలో ఉంటే ఖచ్చితంగా ఫలితం మరో విధంగా ఉంటుంది. కాని ఈ ముగ్గురు షారుఖ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఒప్పుకుంటారా అనేది చూడాలి. ఇదే సంవత్సరంలో ప్రారంభం అయ్యి, వచ్చే సంవత్సరం ఈద్‌కు చిత్రాన్ని విడుదల చేయాలని కబీర్‌ ఖాన్‌ భావిస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు అతి పెద్ద గుడ్‌న్యూస్‌

‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రేక్షకుల స్పందన

లై మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

షారుఖ్‌ సినిమాలో రజినీకాంత్‌, ప్రభాస్‌? - Telugu Bullet