లై మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

lie movie review

Posted August 11, 2017 at 12:00 

నటీనటులు :   నితిన్ , మేఘా ఆకాష్ , అర్జున్ , రవి కిషన్ , శ్రీరామ్ 
నిర్మాత :  ఆచంట గోపీనాథ్ , ఆచంట రాము , అనిల్ సుంకర 
దర్శకత్వం :   హను రాఘవపూడి 
మ్యూజిక్ డైరెక్టర్ :   మణిశర్మ 
ఎడిటర్ :   ఎస్ ఆర్ శేఖర్ 
సినిమాటోగ్రఫీ : జే.యువరాజ్ 

అ ఆ తరవాత నితిన్ ఆలోచించి ఆలోచించి ఎంచుకున్న, చేసిన సినిమా లై. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన కధకి ఇటు నితిన్, అటు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నచ్చి చేసిన సినిమా లై. హీరో, నిర్మాతలతో పాటు పోస్టర్స్, టీజర్ తో ఈ సినిమా మీద ప్రేక్షకులు కూడా ఓ అంచనా పెట్టుకున్నారు. ఇందరి నమ్మకాల్ని, అంచనాల్ని నేడు విడుదల అయిన లై ఎంత మేరకి నిలబెట్టుకుందో చూద్దాం.

లై ‘ అంటే అబద్ధం కానీ స్పెల్లింగ్ కి వచ్చేసరికి మూడు అక్షరాలకు మూడు భిన్నమైన భావాలకి సూచికగా నిలిచింది. ఎల్ అంటే లవ్ అని, ఐ అంటే ఇంటలిజెన్స్ అని, ఈ అంటే ఎనిమిటి అని. ప్రేమ, తెలివితేటలు, శత్రుత్వం… ఈ మూడింటిని కలిపి ఓ థ్రిల్లర్ సినిమాగా మలచడానికి దర్శకుడు హను రాఘవపూడి చేసిన ప్రయత్నమే లై.

కథ…

లై సినిమా అర్జున్ పోలీసుల నుంచి తప్పించుకునే ఓ ఆసక్తికర ఎపిసోడ్ తో మొదలు అవుతుంది. ఏ . సత్యం( నితిన్ ) ఈ తరం కుర్రోడు. ఓ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. చైత్ర ( మేఘ ఆకాష్ ) కూడా అమెరికా లాంటి ప్రదేశాల్లో టూర్ కి వెళ్లే అబ్బాయిని పెళ్లి చేసుకోడానికి రెడీ గా ఉంటుంది. ఆ అమ్మాయిని అబద్ధాలతో బుట్టలో వేసుకుంటాడు సత్యం. సరదా సరదాగా సాగే వీరి ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ఎప్పుడైతే సత్యానికి పద్మనాభం ( అర్జున్ ) ఎదురు పడతాడో అప్పటినుంచి మొత్తం కధే మారిపోతుంది. సత్యం ప్రేమ, జీవితం కూడా రిస్క్ లో పడతాయి. పరిచయం అయిన పాత్రలన్నీ ఒక్కో లక్ష్యంతో అమెరికాలో అడుగు పెడతాయి. ఓ వైపు పోలీసులు అర్జున్ కోసం వెదుకుతుండగానే నితిన్, అతని మధ్య మైండ్ గేమ్ మొదలు అవుతుంది. అర్జున్ ఎంతో విలువగా చూసుకునే ఓ బాగ్ చుట్టూ అన్నీ పాత్రలు పరిగెడతాయి.అసలు ఆ బాగ్ లో ఏముంది? ఈ పరిస్థితుల్లో అర్జున్ ఎత్తుగడల్ని తట్టుకుని నితిన్ ముందుకు ఎలా సాగుతాడు, ప్రేమ, జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ…

మాములు కథకి ప్రేమతో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అమర్చితే ఎలా ఉంటుందో లై చూస్తే అర్ధం అవుతుంది. మైండ్ గేమ్, క్రైమ్ థ్రిల్లర్ ని దర్శకుడు హను రాఘవపూడి ఎంతో చాకచక్యంగా ఓ ప్రేమకథతో ముడిపెట్టేసాడు. సినిమా ఆసాంతం సస్పెన్స్ కొనసాగిస్తూనే ప్రేమ, మైండ్ గేమ్, కమర్షియల్ ఎలిమెంట్స్ కి స్థానం కల్పించిన హను రాఘవపూడి ని మెచ్చుకోవాల్సిందే.
ఇక ఈ సినిమా నటుడిగా నితిన్ లోని కొత్త కోణాన్ని ముందుకు తెచ్చింది. ఇక అర్జున్ అనే నటుడి విశ్వరూపం చూపించింది లై. అర్జున్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అని చెప్పడం కన్నా ఆ పాత్ర చుట్టూనే ప్రేక్షకుడి మనసు తిరిగేలా చేసాడు. ఓ విలన్ పాత్రని ఇంత బాగా తీర్చిదిద్దిన వైనం ఈ మధ్య కనపడలేదు. హాట్స్ ఆఫ్ అర్జున్. ఇక మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది.

ప్లస్ పాయింట్స్…
అర్జున్
నితిన్
సస్పెన్స్
నటుల మధ్య కెమిస్ట్రీ
రిచ్ టేకింగ్
లొకేషన్స్
మైండ్ గేమ్
హను డిఫరెంట్ స్క్రిప్ట్
మణిశర్మ మ్యూజిక్
మైనస్ పాయింట్స్…
క్లయిమాక్స్
వినోదం పాళ్ళు తక్కువ

తెలుగు బులెట్ పంచ్ లైన్… ‘ లై ‘ అబద్ధాన్ని నిజం చేయబోయాడు.
తెలుగు బులెట్ రేటింగ్…  3 / 5 .

మరిన్ని వార్తలు:

నేనే రాజు నేనే మంత్రి మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

SHARE