సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు అతి పెద్ద గుడ్‌న్యూస్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం ‘స్పైడర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న స్పైడర్‌ చిత్రం దసరకు రిలీజ్‌ ఉంది. స్పైడర్‌ విడుదల కాకుండానే కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని మహేష్‌బాబు మొదలు పెట్టాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేయడం జరిగింది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబును నటింపజేసేందుకు దర్శకుడు ఉవ్విల్లూరుతున్నాడు. అందుకు మహేష్‌బాబు కూడా ఓకే చెప్పాడు. ఆరోగ్యం కాస్త సహకరించకున్నా కూడా కృష్ణ తన కొడుకుతో కలిసి నటించేందుకు ఓకే చెప్పారు.

‘భరత్‌ అను నేను’ చిత్రంలో కృష్ణ నటించబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. చాలా సంవత్సరాల తర్వాత మహేష్‌బాబు, కృష్ణ నటించబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘వంశీ’ మరియు ‘టక్కరి దొంగ’ చిత్రాల్లో కృష్ణ గెస్ట్‌ రోల్‌లో కనిపించడం జరిగింది. ఆ చిత్రాల తర్వాత మళ్లీ ఇద్దరి కాంబోలో సినిమాలు వచ్చింది లేదు. ఇన్నాళ్లకు ఫ్యాన్స్‌ కోరికను కొరటాల శివ నెరవేర్చబోతున్నాడు. ‘భరత్‌ అను నేను’ చిత్రంలో కృష్ణ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుందని, అయితే ఆ పాత్ర ఏంటి అనేది సినిమా విడుదల వరకు కూడా సస్పెన్స్‌గా ఉంచబోతున్నట్లుగా చెబుతున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు అతి పెద్ద గుడ్‌న్యూస్‌ - Telugu Bullet