‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రేక్షకుల స్పందన

nene-raju-nene-mantri-getting-positive-response-from-audience

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రానా, కాజల్‌ జంటగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకునేలా ఉందని విమర్శకుల నుండి రివ్యూలు వస్తున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమా విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. రానా పవర్‌ ఫుల్‌ పొలిటికల్‌ లీడర్‌గా ఆకట్టుకున్నాడని, విభిన్న కథతో దర్శకుడు తేజ సినిమాను చక్కగా నడిపించాడంటూ ప్రేక్షకులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో మౌత్‌ టాక్‌తో భారీగానే సినిమా వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రేక్షకులు ప్రతి సీన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నడిచిన సీన్స్‌ను మాస్‌ ఆడియన్స్‌ ఆధరిస్తున్నట్లుగా తెలుస్తోంది. రానాకు తగ్గ పాత్ర అని, భల్లాలదేవుడి తర్వాత అంత పవర్‌ ఫుల్‌గా ఈ పాత్ర ఉందని, హీరోగా రానాకు ఇదో బెస్ట్‌ సినిమా అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి ప్రేక్షకుల నుండి పాజిట్‌ రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. నేడు మరో రెండు చిత్రాలు విడుదలైన కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. తప్పకుండా లాంగ్‌ రన్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టడం ఖాయం అని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు

మరిన్ని వార్తలు:

ద‌బాంగ్ ను మించిపోయిన బాహుబ‌లి

2.0 కు భారీ బిజినెస్

అభిమానులూ ఇదేం ప‌ని..?