మూడు నెలలుగా పకృతి వైధ్యం తీసుకుంటున్న అనుష్క, ఏమైందో?

anushka taking natural treatment for weight loss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్‌ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుష్క. ఈ అమ్మడు ప్రస్తుతం ‘భాగమతి’ అనే చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందా లేక ఇంకా కొనసాగుతుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు. అనుష్క ‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం దాదాపు 25 కేజీల బరువు పెరిగిన విషయం తెల్సిందే. ఆ బరువును తగ్గించుకునేందుకు అనుష్క గత సంవత్సర కాలంగా నానా యాతన పడుతూనే ఉంది. బరువును సులభంగానే పెరిగిన ఈ అమ్మడు తగ్గేందుకు మాత్రం ఇబ్బంది పడుతుంది. యోగా బ్యూటీ అయిన అనుష్క సునాయాసంగానే బరువు తగ్గుతాను అని భావించింది. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మునుపటి నాజూకు రూపం రావడం లేదు. దాంతో ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు.

చివరిగా అనుష్క ప్రస్తుతం పకృతి వైధ్యంను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఆయుర్వేదికంగా బాడీ మసాజ్‌లు మరియు ఆకు పసరుతో, కొన్ని రకాల ఆహారాలు మాత్రమే తీసుకుంటూ ఈ చికిత్సను పొందాల్సి ఉంటుంది. కేరళలోని ఒక మారు మూల ప్రాంతంలో అనుష్క గత మూడు నెలలుగా ఈ వైధ్యం చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారంలో రెండు రోజులు అక్కడ వైధ్యం కోసం అనుష్క ఉంటున్నట్లుగా కూడా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అనుష్క ‘బాహుబలి 2’ విడుదలైనప్పటి నుండి మరో సినిమాకు కమిట్‌ అయ్యింది లేదు. ఎందుకంటే ఆమె బరువు ఆమెకు ఇబ్బందిగా మారింది.

ఆ బరువుతో సినిమాలో నటిస్తే ఆకట్టుకోక పోవడంతో పాటు, సినిమాకు తాను మైనస్‌ అవుతాను అనే భయంతో ఆమె సినిమాలకు కమిట్‌ అవ్వడం లేదు. ‘మిర్చి’ సమయంలో అనుష్క ఎలా ఉండేదో అలాంటి లుక్‌ కోసం, అంతటి బరువు కోసం ప్రయత్నాలు చేస్తుంది. అనుష్క ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు పడాలో పాపం అంటూ ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క ‘భాగమతి’ చిత్రం కోసం కూడా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. భాగమతి చిత్రాన్ని అశోక్‌ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు