30 లక్షలు అంటున్నా పట్టించుకోరేం?

tamanna don't have movie offers while 6.30 lakhs remuneration only

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్‌ ఒక్కసారిగా దిగజారిపోయింది. మొన్నటి వరకు ఈ అమ్మడితో స్టార్‌ హీరోలు, యువ హీరోలు నటించేందుకు క్యూ కట్టేవారు. ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చేవి. ఈమె ఎంత పారితోషికం డిమాండ్‌ చేసినా కూడా నిర్మాతలు కళ్లు మూసుకుని ఇచ్చేవారు. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ అమ్మడికి భారీ పారితోషికం కాదు కదా, కనీసం ఆఫర్లు ఇచ్చే వారు కరువయ్యారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదలైన తర్వాత ఈమెకు అమాంతం క్రేజ్‌ పెరుగుతుందని భావించారు. కాని ఆ సినిమా వల్ల తమన్నాకు రూపాయి కూడా లాభం దక్కలేదు. ఆ సినిమా తర్వాత మెల్ల మెల్లగా తమన్నాకు అవకాశాలు కరువయ్యాయి. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా సఫలం కాలేదు.

తెలుగులో ఇటీవలే ‘జైలవకుశ’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే. ఐటెం సాంగ్‌కు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుందనే వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాటను తమన్నా అతి తక్కువ పారితోషికాన్ని చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం 10 లక్షలు మాత్రమే అందుకుందట. తమన్నా కావాలని ఆ పాటను చేసింది. పారితోషికం అస్సలు ఇవ్వకున్నా పర్వాలేదు, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని తమన్నా కోరుకుంది. ఆ విషయం దేవిశ్రీ ప్రసాద్‌ ద్వారా ఎన్టీఆర్‌కు తెలియజేసింది. ఎన్టీఆర్‌ కూడా తమన్నాపై అభిమానంతో ఐటెం సాంగ్‌ ఆఫర్‌ ఇచ్చాడు.

జైలవకుశ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసిన తర్వాత మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయని తమన్నా భావించింది. కాని తమన్నా కోరుకున్నట్లుగా జరగలేదు. తమన్నా అవకాశాలు రాకపోవడంతో తన పారితోషికాన్ని అమాంతం తగ్గించింది. తాజాగా ఈమె ఒక సినిమాలో నటించేందుకు కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకుంటుంది. ఇంతగా పారితోషికం తగ్గించినా కూడా ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. తమన్నా కెరీర్‌ ఖతం అయ్యిందని, ఆమె మరో ఫీల్డ్‌ను వెదుక్కుంటే బెటర్‌ అంటూ సినీ వర్గాల వారు సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.