హరీష్‌ శంకర్‌ షారుఖ్‌ను కలవడం వెనుక కారణం తెలిసి పోయింది

director harish shankar With Shah Rukh Khan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌తో ‘డీజే’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌ హిట్‌ను అందుకున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం తన తర్వాత సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. దిల్‌రాజు నిర్మాణంలో హరీష్‌ శంకర్‌ కొత్త సినిమా ఉండబోతుంది. ఇటీవలే విదేశాల్లో లొకేషన్స్‌ సెర్చ్‌కు దర్శకుడు హరీష్‌ శంకర్‌ వెళ్లాడు. ఆ విషయాన్ని స్వయంగా హరీష్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. తాను కొత్త సినిమా ఏర్పాట్లలో ఉన్నాను అని, త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రకటించాడు. ఆ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఆశ్చర్య పర్చుతూ హరీష్‌ శంకర్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ను కలిసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం జరిగింది.

జీవితంలో ఎప్పటికి షారుఖ్‌ను కలవడం మర్చిపోలేను అని, ఆయనతో గడిపిన సమయం జీవితాంతం గుర్తుండి పోతుందని హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఎందుకు కలిశాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. షారుఖ్‌ ఖాన్‌ను హరీష్‌ శంకర్‌ ఎందుకు కలిసి ఉంటాడు అంటూ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొందరి ఊహాగాణం ప్రకారం ‘డీజే’ చిత్రాన్ని షారుఖ్‌ నిర్మాణంలో హిందీలో హరీష్‌ శంకర్‌ రీమేక్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడని, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో కాకున్నా ‘డీజే’ సినిమా రైట్స్‌ విషయంలో షారుఖ్‌ స్వయంగా హరీష్‌ను పిలిపించుకుని మాట్లాడినట్లుగా కొందరు భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆ భేటీకి ఎలాంటి ప్రత్యేకత లేదని, ఏదో పనిమీద ముంబయి వెళ్లిన హరీష్‌ శంకర్‌కు అనుకోని అవకాశం దక్కినట్లుగా షారుఖ్‌ను కలిసే అవకాశం వచ్చిందని అంటున్నారు.