ప్రపంచ మహాసభలు లో తెలంగాణ పై ‘ప్రత్యక గీతం’

telangana-special-Song--jai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అడుగేద్దాం పరిగెడదాం, ఘన చరిత్రకు సలము కొడదాం!
అడుగేద్దాం పరిగెడదాం, ఘన చరిత్రకు సలము కొడదాం!

జై హో… జై హో… జై హో
తెలంగాణ కవులకు జయహో
జై హో… జై హో… జై హో
తెలంగాణ కళలకు జై హో

కాలమనే కాగితాలపై, ఆశయాలనే అక్షరాలతో,
ప్రతి పదం ప్రగతి పధంలో నడిపించిన మనకలం వీరులకు
జై హో జై హో జై హో…. జై హో… జై హో

జాన తెలుగులోతెనేలూరగా, పాలకుర్తిలో సోమనాధుడు,
రాసినాడుగా బసవ పురాణం,తెలంగాణ తోలి స్వతంత్ర కావ్యం…
ద్విపద అనే చంధస్సు దారిలో, రంగనాథరామాయనాన్ని,
రచించే గోన బుద్దా రెడ్డి, రంగు రుచి ప్రతీ మాటకు అద్ది….
భారమంతాదేవుడిపై వేసి, మట్టి నెలలో సేద్యం చేసి,
భగవత ఫలాలందించాడు బమ్మెర పోతన మనకారాధ్యుడు…
పొన్నగంటితెలగన్నవిరచితం,మధ్యతెలుగులోహేయాదిచరితం
రామదాసుపదభావాసాగరం, మునిగిన మది భద్రాద్రిగోపురం….
జై హో జై హో జై హో…. జై హో… జై హో

మన ప్రాంతంలో పత్రిక నడిపి, మన కవి మిత్రుడు సత్తువ తెలిపి,
ప్రసాదించెను ఒక వరం,ప్రతాపరెడ్డిసురవరం….
బడి పలుకుల భాషే సరికాదని పలుకుబడులభాషే మన సిరి అని,
ఎలుగేత్తినాడు కాళోజి,తెలంగాణకే దిక్సూచి…
అభినవ పోతన బిరుదాంకితులువానమామలై వరదాచార్యులు,
తాను పలికిన నీతి పద్యాలు, పుస్తకాలలో పా(ఠ్య)ట్యంశాలు….
ఒక చేత్తోటి గన్ను పట్టుకుని, వేరొకచేత్తో పెన్ను పట్టుకునిపోరాటంలో
తన వంతు పాత్ర పోషించాడు, మన హనుమంతు….
జై హో జై హో జై హో…. జై హో… జై హో

నాటకాలలోనాంది గీతం తెలుగులోనతొలి సినిమా గేయం
రాసేనురసధునిచిందేల, కేసవదాసుచందాల…
తెలంగాణ విముక్తి కోసం, ఉద్యమించిన పద్యసారధి
అగ్నిధారలై పొంగెనుసరధి, అతడే అతడే దాసరథి….
దేవభాషలో చదివిన వేదం, దేశభాషలో అందరికోసం
అనువదించినఅసామాన్యుడుఅభినవ, వ్యాసుడు రంగాచార్యుడు….
పాటా కవితా నాటిక వ్యాసం, కథలుగజలుకృతులు కావ్యం,
అన్నిప్రక్రియలఅగ్రపీఠము, సినారేమనకుజ్ఞానపీఠము…
జై హో జై హో జై హో…. జై హో… జై హో

అన్నాఅన్నాఅన్నా, తెలంగాణ అంటే ఏందన్నా?
విన్నావాఓ అన్న ఇది కవులనందించుఖార్ఖాన….
కవులనందించుఖార్ఖాన, ఇదికవులనందించు ఖార్ఖాన….

అడుగేద్దాం పరిగెడదాం, ఘన చరిత్రకు సలము కొడదాం!
అడుగేద్దాం పరిగెడదాం, ఘన చరిత్రకు సలము కొడదాం!