నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న విరుష్క డ్యాన్స్ వీడియో

Virat Kohli and Anushka Sharma dance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నిన్న‌టిదాకా విరుష్క పెళ్లి, హ‌నీమూన్ వార్త‌లు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేయ‌గా… ఇప్పుడిక రిసెప్ష‌న్ వంతు వ‌చ్చింది. ఢిల్లీలోని తాజ్ ప్యాల‌స్ ద‌ర్బార్ హాల్ లో గురువారం రాత్రి జ‌రిగిన వెడ్డింగ్ రిసెప్ష‌న్ లో విరుష్క జోడీ డ్యాన్స్ వీడియోతో సోష‌ల్ మీడియా హోరెత్తుతోంది. విరుష్క పెళ్లి విందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీతో పాటు క్రికెట‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్, సురేశ్ రైనా, గంభీర్ హాజ‌ర‌య్యారు. విందులో విరాట్, అనుష్క పూర్తి సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన దుస్తులు ధ‌రించారు. హీరోయిన్ గా ఎప్పుడూ మోడ్రన్ వేష‌ధార‌ణ‌లో క‌నిపించే అనుష్క రిసెప్ష‌న్ లో ఉత్త‌రాది సీరియ‌ల్స్ లో కనిపించే సంప్ర‌దాయ కోడ‌లి త‌ర‌హాలో మేక‌ప్ అయ్యారు.

పెద్ద ఆభ‌ర‌ణాలు, చేతినిండా గాజులు, పాపిటి నిండా సింధూరం, పెద్ద అంచు చీరతో ఉన్న అనుష్క ఆహార్యం చూడ‌గానే క‌ట్టిప‌డేసేలా ఉంది. చీర‌లోనే ఆమె భ‌ర్త‌తో క‌లిసి ప్ర‌ముఖ పంజాబీ గాయ‌కుడు గురుదాస్ మాన్ ఆల‌పించిన ఓ పాట‌కు డ్యాన్స్ చేసింది. విరుష్క జోడీతో పాటు క్రికెట‌ర్ ధావ‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో కాలు క‌దిపాడు. అనుష్క విరాట్, ధావ‌న్ తో క‌లిసి స్టెప్పులేసింది. ఈ క్ర‌మంలో నోటితో ఓ క‌రెన్సీ నోటు ప‌ట్టుకుని ఆమె చేసిన డ్యాన్స్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అటు ఈ నెల 26న ముంబైలో విరుష్క జోడీ మ‌రో విందు ఇవ్వ‌నుంది. క్రికెట‌ర్లు, బాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ రిసెప్ష‌న్ కు హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాతి రోజు కోహ్లీ సేన దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్తోంది. అనుష్క కూడా భ‌ర్త‌తో పాటు ద‌క్షిణాఫ్రికా వెళ్ల‌నుంది.