గుడ్ న్యూస్ : ఉస్తాద్ భగత్ సింగ్: అదరగొట్టిన భగత్ బ్లేజ్…

Good News: Ustad Bhagat Singh: Blaze Bhagat
Good News: Ustad Bhagat Singh: Blaze Bhagat

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ (ustaad bhagat Singh). ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే రిజల్ట్ ని రిపీట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా భగత్’ స్ బ్లేజ్ అంటూ వీడియో ని రిలీజ్ చేశారు. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ పవర్ ఫుల్ వీడియో లో డైలాగ్స్ బాగున్నాయి. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.