Election Updates: ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్‌ బస్సు యాత్ర: సజ్జల

Election Updates: Jagan's bus trip from Idupulapaya to Ichapuram: Sajjala
Election Updates: CM Jagan will announce YCP party candidates today

సజ్జల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ఉంటుందని సజ్జల చెప్పారు. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ దగ్గర జగన్‌ నివాళి అర్పిస్తారని చెప్పారు. ప్రొద్దుటూరులో జగన్‌ ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ నిర్వహిస్తామని సజ్జల చెప్పారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్‌ బస్సు యాత్ర చేస్తారన్నారు సజ్జల.27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ఉంటుందని… 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ చెప్పారు. 29న గుడ్ ఫ్రైడే ఆ రోజు సెలవు… ఆ రోజంతా జగన్ గారు అక్కడే వుంటారని అన్నారు. 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు.