“మిస్టర్ బచ్చన్” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది !

“మిస్టర్ బచ్చన్” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది !
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్. వీరి కాంబినేషన్ లో గతం ల్ షాక్, మిరపకాయ సినిమా లు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. ఈ సినిమా లు విశేషం గా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్.

మాస్ మహారాజ రవితేజ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి సంబందించిన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఎగ్జైటింగ్ షెడ్యూల్ జరుగుతోంది అని మేకర్స్ వెల్లడించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా లో భాగ్య శ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.