‘గాజు’ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జోష్!

Pawan Kalyan's fans are excited with 'Gaju' dialogue!
Pawan Kalyan's fans are excited with 'Gaju' dialogue!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీ కి సంబందించిన పవర్ ఫుల్ భగత్ బ్లేజ్ (bhagat blaze) ని నిన్న మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లాస్ డైలాగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ డైలాగ్ పై పవన్ కళ్యాణ్ ఒక ఈవెంట్ లో కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి గాజు గ్లాస్ కింద పడేస్తాడు. అది ముక్కలవుతుంది. షూటింగ్ టైమ్ లో ఎందుకు ఈ సీన్ రాసావు అని అడిగా, గాజుకి ఉన్న లక్షణం ఏమిటంటే, పగిలేకొద్ది పదునెక్కిద్ది, మీనుంచి నేను ఇలాంటివి కోరుకుంటాం. మీరు తగ్గితే మాకు నచ్చదు అని హరీష్ శంకర్ వ్యాఖ్యలు వెల్లడించారు. అయితే మూవీ ల్లో ఇలాంటి డైలాగ్స్ చెప్పడం తనకు ఇష్టం లేదని, హరీష్ శంకర్ బాధ పడలేక, ఆ డైలాగ్ ని చెప్పినట్లు తెలిపారు పవన్.

 

వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ మూవీ కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకం తో ఉన్నారు.