మల్టీస్టారర్‌ ఏమైంది హరీష్‌?

Director Harish Shankar Next Movie Seetimar With Tollywood Young Star
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌తో ‘డీజే’ చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన తర్వాత సినిమాను ఇంత వరకు కన్ఫర్మ్‌ చేయలేదు. ఆ మద్య దిల్‌రాజు బ్యానర్‌లో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని హరీష్‌ శంకర్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. స్వయంగా హరీష్‌ శంకర్‌ కూడా ‘దాగుడు మూతలు’ అనే ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ చిత్రం లొకేషన్స్‌ కోసం విదేశాల్లో కూడా తిరిగేసి వచ్చాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ చిత్రంను అటకెక్కించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు దర్శకుడు హరీష్‌ శంకర్‌ కొత్త సినిమా మల్టీస్టారర్‌ కాదని, ఒక యువ హీరోతో సింపుల్‌గా తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. 

మెగా హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తాడని, యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా మాత్రం ఒక యువ హీరోతో ‘సిటీమార్‌’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజు బ్యానర్‌లోనే ఈ చిత్రం తెరకెక్కబోతుంది. మల్టీస్టారర్‌ చిత్రంను ప్రస్తుతానికి పక్కన పెట్టాడని, త్వరలోనే ‘సిటీమార్‌’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడని హరీష్‌ శంకర్‌ సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఒక యువ హీరో ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. ఇటీవలే రెండు సక్సెస్‌లు దక్కించుకున్న ఆ హీరోకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని, ‘సిటీమార్‌’ టైటిల్‌తో ఆ యువ హీరో మరో సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇంతకు ఆ యువ హీరో ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.