బాబు చేతిలో పావు సోము వీర్రాజు.

Chandrababu Plans to Farm third Front against Modi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సోము వీర్రాజు… సీఎం చంద్రబాబు మీదకు ఏ యుద్ధానికైనా సన్నద్ధం అయినవాడు. బీజేపీ, టీడీపీ బంధాన్ని తెగ్గొట్టి వైసీపీ తో కమలానికి ముడిపెడదామని తెగ ప్రయత్నించినవాడు. నేడు టీడీపీ, బీజేపీ మధ్య రావణకాష్టానికి తొలిగా నిప్పు రాజేసినవాడు. అలాంటి సోము వీర్రాజు చంద్రబాబు కి శత్రువా, మిత్రుడా ?. ఈ ప్రశ్నకు వందకు వంద శాతం శత్రువు అనే చెబుతారు. కానీ నిజానికి సోము వీర్రాజు ఏ ఉద్దేశంతో ఏమి చేసినా అతను చంద్రబాబు రాజకీయ చదరంగంలో ఓ పావులా ఉపయోగపడ్డాడు. అదెలా అనే కదా మీ డౌట్?. చూద్దాం.

2014 లో కేంద్రం లో బీజేపీ సొంత బలంతో మోడీ సర్కార్ ఏర్పడ్డ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ని రాజకీయ కోణంలోనే చూడడం మొదలైంది. చంద్రబాబు రాజకీయంగా బలపడతాడేమోనన్న భయంతో మోడీ ఆంధ్ర గొంతు నొక్కడానికి ప్రయత్నించారు. అయితే వెంకయ్య నాయుడు చొరవతో అప్పుడప్పుడు కొన్ని పనులు చేయక తప్పలేదు. ఆ అడ్డం కూడా తొలగించుకున్న మోడీని డీకొడితే ఏమి అవుతుందో అన్న భయంతో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. అయితే రాజకీయ కారణాలు కాకుండా ఆంధ్ర అభివృద్ధి అన్న కోణంలోనే ఎప్పటికైనా గళం ఎత్తాలని చంద్రబాబు భావించారు. ఆ గొంతు ఆంధ్ర అభివృద్ధి తో పాటు జాతీయ స్థాయిలో మోడీ, కాంగ్రెస్ వ్యతిరేకులని ఏకం చేయడానికి ఉపయోగపడాలని బాబు అనుకున్నారు. అయితే తనంత తానుగా ఈ పని చేస్తే ఏమి అవుతుందో ఆయనకు తెలుసు. అలాంటి సమయంలో సోము వీర్రాజు తనపై వ్యక్తిగతంగా చేసిన చంద్రబాబుకు అంది వచ్చాయి.

ఆ సందర్భాన్ని వాడుకుని అందరి దృష్టి ఏపీ లో బీజేపీ, టీడీపీ బంధం ఉంటుందా ఊడుతుందా అన్న అంశం మీదకు మళ్ళించాడు. బీజేపీ అధిష్టానం కూడా ఇదే విషయం మీద జుట్టు పీక్కునే పరిస్థితి కల్పించాడు. ఆ సమయాన్ని తెలివిగా వాడుకున్న బాబు జాతీయ స్థాయిలో మోడీ, కాంగ్రెస్ వ్యతిరేకులు అయిన మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, నవీన్ పట్నాయక్, ఎస్పీ, బీఎస్పీతో పాటు nda భాగస్వామిగా మారిన నితీష్ తోను చంద్రబాబు తొలివిడత చర్చలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక కమల్ స్వయంగా బాబు తనతో మాట్లాడినట్టు చెప్పారు. ఇదంతా జాతీయ స్థాయిలో మూడో కూటమి కోసం అని వేరే చెప్పక్కర్లేదు. తెలంగాణ సీఎం కెసిఆర్ సైతం ఈ ప్రయత్నాలకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత కీలక ఘట్టం జరిగేటప్పుడు సోము వ్యాఖ్యల వల్ల బీజేపీ కేవలం ఆంధ్ర, టీడీపీ గురించి మాత్రమే ఆలోచించింది. అలా బీజేపీ చాప కిందకు నీరు తెచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు సోము ఓ పావులా ఉపయోగపడ్డాడు .