ఎమ్మెల్యే సిద్దం అవుతున్నాడు

Nandamuri Kalyan Ram Latest Film MLA Will Be Released on March 23
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి హీరో కళ్యాణ్‌ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. రెంటిలో మొదటగా ఎమ్మెల్యే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి లక్షణాలున్న అబ్బాయి అనే ట్యాగ్‌ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ చాలా స్పెషల్‌గా కనిపించబోతున్నాడు. సినీ వర్గాల్లో ఆసక్తి ఉన్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘కిరాక్‌ పార్టీ’ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేయాలని భావించారు. అయితే వారం ముందుగానే నిఖిల్‌ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. దాంతో కళ్యాణ్‌ రామ్‌ తన చిత్రాన్ని ఆ తేదీలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 

పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా వర్క్‌ చేసిన ఉపేంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనువైట్ల శిష్యుడు అయిన ఈయన అదే స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘ఎమ్మెల్యే’ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఏకంగా 20 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లో కూడా మొదటి సారి కళ్యాణ్‌ రామ్‌ అత్యధిక థియేటర్లలో రాబోతున్నాడు. ఓవర్సీస్‌ రైట్స్‌ ఏకంగా 85 లక్షలకు అమ్ముడు పోయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పరీక్షల సీజన్‌ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేకు మంచి కలెక్షన్స్‌ వస్తాయని ట్రేడ్‌ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. ‘ఎమ్మెల్యే’ విడుదలైన వారం రోజుల తర్వాత మెగా పవర్‌స్టార్‌ రంగస్థలం విడుదల కాబోతుంది. అందుకే మొదటి వారంలోనే ఈ చిత్రం పూర్తి కలెక్షన్స్‌ను రాబట్టేలా ప్లాన్‌ చేస్తున్నారు.