అబ్బో ఎమ్మెల్యే.. సత్తా చాటాడు

Kalyan Ram Highest First day Collections In Career With MLA Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ తాజాగా ‘ఎమ్మెల్యే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యే చిత్రంపై అంచనాలు భారీగా వచ్చాయి. కళ్యాణ్‌రామ్‌ లుక్‌తో పాటు కాజల్‌ గ్లామర్‌ ఈ చిత్రానికి కలిసి వస్తుందని అంతా భావించారు. కాని అసలు కథ మూసగా ఉండటంతో పాటు, స్క్రీన్‌ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో సినిమా ఫలితం తారు మారు అయ్యింది. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు, ఎమ్మెల్యేకు మొదటి నుండి భారీ అంచనాలున్న నేపథ్యంలో మొదటి రోజు అత్యధిక వసూళ్లను ఈ చిత్రం సాధించింది. 

కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అధికంగా ‘ఎమ్మెల్యే’ మొదటి రోజు కలెక్షన్స్‌ ఉన్నాయి. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 5.23 కోట్లను వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియాలో 90 లక్షల షేర్‌ను ఈ చిత్రం దక్కించుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక సీసెడ్‌లో కూడా ఎమ్మెల్యే సత్తా చాటాడు. ఓవర్సీస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మొదటి రోజు మంచి వసూళ్లు రావడంతో నిర్మాతల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. మరో మూడు రోజులు కూడా ఇదే రేంజ్‌లో వసూళ్లను సాధిస్తే ఖచ్చితంగా సినిమా నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డున పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకం లేదు. రెండవ రోజు నుండే కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి.