కాజల్‌కు ఇది కూడా నిరాశే

Kajal Agarwal Again In Failure With Kalyan Ram MLA Movie Disaster

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత సంవత్సరం చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రంలో నటించిన కాజల్‌కు ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. గత కొంత కాలంగా కెరీర్‌ను కష్టంగా కొనసాగిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ కాజల్‌ తాజాగా కళ్యాణ్‌రామ్‌కు జోడీగా ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో కాజల్‌కు షాక్‌ తగిలినట్లయ్యింది. కళ్యాణ్‌ రామ్‌పై నమ్మకం పెట్టుకుని చేసిన సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో కాజల్‌ కెరీర్‌ మరింత కష్టాల్లో పడ్డట్లయ్యింది. 

‘ఎమ్మెల్యే’ చిత్రం సక్సెస్‌ అయితే మళ్లీ స్టార్‌ హీరోలతో నటించే అవకాశం వస్తుందని, తప్పకుండా మళ్లీ ఫామ్‌లోకి వస్తాను అని కాజల్‌ భావించింది. అందుకే రవితేజ, శ్రీనువైట్ల మూవీకి నో చెప్పింది. భారీ పారితోషికం డిమాండ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమాకు నో చెప్పిన కాజల్‌ ప్రస్తుతం తగ్గించుకుని చేస్తాను అన్నా కూడా ఈమెకు ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు. తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే ఈమె స్టార్స్‌ సరసన నటించేసింది. దాంతో మళ్లీ ఆ స్టార్స్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెతో నటించేందుకు ఆసక్తి చూపుతారన్న నమ్మకం లేదు. దాంతో కాజల్‌కు ఎమ్మెల్చే చిత్రం భారీ నిరాశను మిగిల్చిందని చెప్పుకోవచ్చు.

కాజల్‌కు ఇది కూడా నిరాశే - Telugu Bullet