ఈసారి కూడా కొత్తమ్మాయికే ఛాన్స్‌…!

Telugu Heroine Chance In Shekar Kammula Movie

శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాను పట్టాలెక్కించలేదనే విషయం తెల్సిందే. ఫిదా సక్సెస్‌ నేపథ్యంలో చాలా గ్యాప్‌ తీసుకుని మంచి కథను సిద్దం చేశాడట. ఈ చిత్రంను ఏషియన్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధినేత సునీల్‌ నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో శేఖర్‌ కమ్ముల ఉన్నాడనే సమాచారం అందుతోంది. దాదాపు రెండు నెలల పాటు అనేక రకాల వడ బోతలు చేసి ఈ చిత్రం కోసం కొత్త కుర్రాడిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. డాన్స్‌ నేపథ్యంలో సినిమా అవ్వడం వల్ల డాన్సర్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని శేఖర్‌ కమ్ముల భావిస్తున్నాడట. అందుకోసం జక్కన్న డాన్స్‌లో ప్రావిణ్యం ఉన్న వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.

Shekar-Kammula

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం కూడా డాన్సర్‌ను వెదికిన శేఖర్‌ కమ్ముల తాజాగా విజయవాడకు చెందిన ఒక తెలుగమ్మాయిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. క్లాసికల్‌ డాన్స్‌లో ప్రావిణ్యం ఉన్న ఆ అమ్మాయి వెస్ట్రన్‌ కూడా డాన్స్‌ చేస్తుందట. అందుకే ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్లుగా శేఖర్‌ కమ్ముల సన్నిహితులు చెబుతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను అతి త్వరలోనే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ పూర్తి చేసి వచ్చే నెలలో షూటింగ్‌ను మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేయాలనేది శేఖర్‌ కమ్ముల ప్రయత్నంగా తెలుస్తోంది. గత ఏడాది ఫిదాతో సక్సెస్‌ దక్కించుకున్న శేఖర్‌ కమ్ముల మరో సక్సెస్‌ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. మరి గట్టిగా కొట్టేనా చూడాలి.