ఆర్‌ మల్టీస్టారర్‌ స్టోరీ లీక్‌.. ఇదే ఆ స్టోరీ

Rajamouli RRR Movie Story Leaked

రాజమౌళి సినిమాల్లో కథలు చాలా బలంగా ఉంటాయనే విషయం తెల్సిందే. చిన్న స్టోరీలైన్‌ అయినా కూడా కథనంను బలంగా మల్చడంలో ఆయనకు ఆయనే సాటి. విభిన్నమైన కథాంశాతో జక్కన్న సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రం కూడా ఒక పీరియాడిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కథ స్వాతంత్య్రంకు ముందు కథ అంటూ సమాచారం అందుతోంది. ఇందుకోసం విజయేంద్ర ప్రసాద్‌ దాదాపు ఆరు నెలలు కష్టపడి ఈ చిత్రం కథను సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్న సమయంలో కథ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యి చర్చనీయాంశం అయ్యింది.

Yash Tweet On RRR Villain Role Rumors

ఈ చిత్రం కథ ప్రకారం స్వాతంత్య్రంకు పూర్తి అంటే 1900వ సంవత్సరంలో ఈ సినిమా సాగుతుందట. అప్పుడు భారతదేశం ఆంగ్లేయు పాలనలో ఉంటుంది. ఆంగ్లేయుల సొమ్మును దోచుకుని పేదలకు ఇచ్చే పాత్ర గజదొంగగా ఎన్టీఆర్‌ కనిపిస్తాడట. ఇక బ్రిటీష్‌ పోలీస్‌గా రామ్‌ చరణ్‌ కనిపిస్తాడట. వీరిద్దరు కూడా హోరా హోరీ పోరాటాలు చేస్తారట. అయితే కొంత సమయం తర్వాత వీరిద్దరు కలిసి పోయి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటారని సమాచారం అందుతోంది. ఈ కథను చాలా విభిన్నంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం క్లారిటీ రావాల్సి ఉంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లకు జోడీగా హీరోయిన్స్‌ను ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే హీరోయిన్స్‌ ఎంపిక జరిగే అవకాశం ఉంది.

SS Rajamouli Next Movie Shooting Begins Next Month