30 కోట్లు కొల్లగొట్టాడు.. స్టార్‌డం అంటే ఇదే

విజయ్‌ దేవరకొండ మరోసారి గట్టిగా కొట్టాను అన్నట్లుగానే కొట్టాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ట్యాక్సీవాలా చిత్రం భారీ వసూళ్లను సాధించింది. సినిమా విడుదలకు రెండు నెల ముందు లీక్‌ అయిన సినిమా ఏదైనా కూడా కనీసం బడ్జెట్‌ రికవరీ చేసింది అంటే గొప్పే అని చెప్పుకుంటారు. కాని అనూహ్యంగా విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ కారణంగా ‘ట్యాక్సీవాలా’ చిత్రం ఏకంగా 30 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించి అబ్బో అనిపించుకుంటుంది. ఇంతటి వసూళ్లను చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఊహించి ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారీ స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధిస్తుందని వారు భావించలేదు.

vijay devarakonda record collection on taxiwala

సినిమా విడుదలై పెట్టిన పెట్టుబడి వస్తే గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అని వారు అనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం మాత్రం పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు నాుగు రెట్ల లాభాలను తెచ్చి పెట్టబోతున్నట్లుగా తాజా కలెక్షన్స్‌ చూస్తుంటే అనిపిస్తోంది. సాదా సీదా కలెక్షన్స్‌ కాకుండా ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంటుంది. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో టాప్‌ 3 చిత్రాల్లో ఇది నిలిచింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తోంది. వీరిద్దరి జోడీ మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఆ చిత్రం వచ్చే జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని దేవరకొండ చెబుతున్నాడు.