జాన్వీ నోట దేవరకొండ మాట…!

Sridevi Daughter Jhanvi Kapoor Shocking Comments On Vijay Devarakonda

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈమె మొదటి సినిమాతో కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా నటిగా మాత్రం మంచి మార్కులు దక్కించుకుంది. ఈమె సౌత్‌ సినిమాల్లో నటిస్తుందని కొందరు అంటూ ఉంటే, ఆమెకు మాత్రం అస్సలు సౌత్‌ సినీ ఇండస్ట్రీపై ఆసక్తి లేదని కొందరు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అంటున్నారు. అయితే తాజాగా జాన్వీ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు ఆమెకు సౌత్‌ సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉందని, సౌత్‌ సినీ హీరోల గురించి ఆమె తెలుసుకుంటుందని అనిపిస్తోంది. జాన్వీ కపూర్‌ తాజాగా టాలీవుడ్‌ యంగ్‌ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పేరు ఎత్తడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Sridevi-Daughter-Jhanvi-Kap

జాన్వీ కపూర్‌ తాజాగా హిందీ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ లో పాల్గొంది. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అదే సమయంలో మీరు రేపొద్దున లేవగానే అబ్బాయిగా మారిపోతే ఎవరిలా మారిపోవాలని అనుకుంటున్నారు అంటూ కరణ్‌ ప్రశ్నించాడు. అందుకు ఆమె తడుముకోకుండా తెలుగు హీరో విజయ్‌ దేవరకొండలా మారిపోవాలని అనుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో జాన్వీ చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది. బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్‌ ఉండగా విజయ్‌ దేవరకొండలా మాత్రమే ఎందుకు ఆమె మారాని అనుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ అంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లుంది. అందుకే భవిష్యత్తులో వీరిద్దరి కాంబో మూవీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Vijay-Deverakonda