చిరును కలిసిన బేబీ భావోద్వేగం (వీడియో)…!

Singer Baby Meet With Megastar Chiranjeevi In His House

ఈమద్య కాలంలో సింగర్‌ బేబి గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక పల్లెటూరులో ఆమె సాదారణ పనులు చేసుకునే ఆమె అద్బుతమైన సింగర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె సరదాగా పాడిన ఒక పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో ఆ వీడియో ప్రముఖులకు చేరింది. ఏకంగా ఏఆర్‌ రహమాన్‌తో పాటు కోటి, రఘు కుంచె ఇంకా ఎంతో మంది ఆమెపై ప్రశంసలు కురిపించారు. తాజాగా చిరంజీవి కూడా స్వయంగా బేబి ని ఇంటికి పిలిపించుకుని మరీ పాటలు పాడమని, ఆమె పాటలు విని, ఆమెను సన్మానించి పంపించాడు.

Chiranjeevi

చిరంజీవి భార్య సురేఖకు సింగర్‌ బేబి పాడిన పాట బాగా నచ్చిందట. అందుకే ఆమె ఎలాగైనా బేబిని కలవాలని చిరంజీవిని కోరడం, అందుకు చిరంజీవి సంగీత దర్శకుడు కోటితో బేబిని తన ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. చిరంజీవిని కలిసిన సమయంలో బేబి సంభ్రమాశ్చర్యాలకు లోనైయ్యింది. ఈ క్షణంలో నేను చనిపోయినా చాలు అంటూ చిరంజీవి కాళ్లు మొక్కింది. ఆ క్షణాలు కొందరు వీడియోలో బంధించారు. తాజాగా ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.