కొరటాల, చిరు సినిమా లేటెస్ట్ అప్డేట్…!

Koratala Siva Chiranjeevi Latest Movie Updates

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత కొరటాల శివ తో ఓ సినిమాలో నటిస్తాడని సోషల్ మీడియాలో ఓ రెండు నెలల నుండి భాగా హడాహుడి మొదలైన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు మెగా కాంపౌండ్ నుండి గాని. ఇటు కొరటాల శివ నుండి ఏలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కొరటాల మాత్రం భరత్ అనే నేను సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకుని రెడీ గా ఉన్నాడు.

ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం మేరకు చిరు, కొరటాల శివ సినిమా ఈ ఏడాది వేసవి నుండి సినిమా స్టార్ట్ కానున్నదని వార్తలు వస్తున్నాయి. ఓ సోషల్ ఓరియెంటెడ్ తో కూడిన చిత్రాని అన్నయ్య తో రుపొందిస్తాడని సమాచారం ఈ చిత్రంలో మెగాస్టార్ ఓ రైతు పాత్రలో కనిపించనున్నాడు. మెగాస్టార్ ఫాన్స్ కూడా కొరటాల శివ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివతో సినిమాను హీరో కం ప్రొడ్యూసర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నాడు. కొరటాల శివసినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా లో చిరంజీవి నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ చిత్రం మొదలు కావాలంటే వచ్చే ఏడాది వరకు అగాలిసిందే. ఈ లోపు సైరా, కొరటాల శివ సినిమాలతో చిరు ఫుల్ బిజీగా ఉంటాడు.