2.ఓ సరికొత్త రికార్డ్స్…!

New Record In Rajinikanth Robo 2.O Movie

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం 2.ఓ. ఈ చిత్రం తెలుగు, తమిళ, హింది, మలయాళ భాషలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తమిళనాడులోని చెన్నైలో 24 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు తాజా సమాచారం. ఇప్పటివరకు చెన్నైలో ఏ సినిమా కూడా ఇంత వసూళ్లను రాబట్టలేదని సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 2.ఓ 500కోట్లు పైకి గ్రాస్ ను రాబట్టింది. మొదటి నుండి కూడా బాలీవుడ్ లో ఈ చిత్రంకు మంచి రెస్పాన్సు రావడంతో అక్కడ ఈ చిత్రం 200కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబటింది.

2.ఓ చిత్రం మాత్రం నిర్మాతలకు లాభాలను మాత్రం తెచ్చి పెట్టలేదు. నిర్మాతలు ఈ చిత్రాని అధిక మొత్తంలో అమ్ముకోవడం వలన లాభాలు మాత్రం రాలేదు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన అమీజాక్సన్ కథానాయకగా నటించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటించారు. లైక ప్రొడక్షన్ ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏఆర్. రెహమాన్ 2.౦ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం తరువాత శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీకాంత్ పెట్టా సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఆ తరువాత రజినీకాంత్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా చెయ్యలిసి ఉన్నది.