బాహుబలి సినిమా తరవాత రాజమౌళి ఇండియన్ డైరక్టర్ గా మారిపోయాడు ఏంతో మంది స్టార్ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం మేరకు రాజమౌళి తన తరువాత సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఓ సినిమాను రుపొందిస్తాడని ఫిల్మ్ నగర్ నుండి అందుతున్నసమాచారం. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలంటే రజినీకాంత్ కు ఉన్న కమిట్ మెంట్స్ పుర్తవ్వాలి. తలైవ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పెటా సినిమాలో నటించాడు.
ఈ చిత్రం జనవరి 10 న విడుదలవుతుంది. ఆ తరువాత సినిమాను మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ్యనున్నాడు. అందుకోసం మురగదాస్ కూడా ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉన్నాడు. మురగదాస్ తరువాత మరో సినిమాను మరల కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని తలైవ మాట ఇచ్చాడంట. ఈ ఇద్దరీ కాంబినేషన్ లో సినిమా పూర్తైన తరువాత రాజమౌలి, రజినీకాంత్ సినిమా ఉంటుందంట. రాజమౌళి కూడా ఈ లోపు ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తవుతుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మరే ఏ రేంజ్ లో ఉంటుందో మన ఉహాకే వదిలేసుకోవాలి. కానీ ఇందులో వాస్తవం ఏంత ఉందొ తెలియాలంటే ఈ ఇద్దరి నుండి అధికారిక ప్రకటన వేలవడలిసిన అవసరం ఉన్నది. సినిమా పరిశ్రమలో ఏదైనా జరగవచ్చుని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు