పెట్టా విడుదల విషయంలో క్లారిటీ లేదు…!

Rajinikanth Petta Movie Release Suspense

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం పెట్టా ఈ సినిమా తమిళంలో పొంగల్ కానుకగా విడుధలవ్వుతుంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా హక్కులను కొనడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు అలాగే తెలుగు డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ కాలేదు. పెట్టా సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముందకు వచ్చాడు. తెలుగు డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఇకా సంక్రాంతి కి ఎలాగైనా సినిమాను విడుదల చెయ్యాలని కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకు సంబందించిన థియేటర్స్ సర్దు బాటులో బిజీగా ఉన్నాడు. తెలుగులో ఈ సంక్రాంతికి చరణ్ వినయ విధేయ రామ, బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్, వరుణ్, వెంకటేష్ ల ఎఫ్2 సినిమాలు రెడీ గా సినిమా థియేటర్స్ బూకింగ్స్ చేసుకొని ఉన్నాయి. పెట్టా సినిమాకు థియేటర్స్ మాత్రం దొరకడం లేదు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ఒప్పొందం ఉన్నది. డబ్బింగ్ సినిమాలను సంక్రాంతికి విడుధలచేయ్యకుడదని. ఇప్పుడు నిర్మాత కళ్యాణ్ పెట్టా సినిమాను ఓ రెండువారాలు పోస్ట్ పోను చేసి రిపబ్లిక్ డే కి విడుదల చేద్దాం అంటే mr మజ్ను రెడీ గా ఉన్నాడు. నిర్మాత బి వి ఎస్ యాన్ ప్రసాద్ పెట్టా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా వార్ర్నింగ్ కూడా ఇచ్చాడంట. ఆ వారాంతంలో కళ్యాణ్ రామ్ 118, నిఖిల్ ముద్ర రెడీ గా ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ పెట్టా విషయంలో ఇంకా సస్పెన్సు కొనసాగుతుంది.