మళ్ళీ 28 సంవత్సరాలకి కుదిరింది…!

Santosh Sivan And Rajinikanth To Work Together After 27 Years

అద్భుతమైన ఫొటోగ్రఫీతో ఆయా సినిమాలకు మరింత అందాన్ని తెచ్చిన కెమెరామెన్ గా సంతోష్ శివన్ కు ఎంతో పేరుంది. తమ సినిమాలకు ఆయనే కావాలని ఆయా దర్శకులు, హీరోలు కోరుకునే టెక్నీషియన్ ఆయన. అటువంటి సంతోష్ సుమారు 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ రజనీ కాంత్ చిత్రానికి పనిచేస్తున్నారు. 1991లో రజనీకాంత్ నటించిన ‘దళపతి’ చిత్రానికి ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు మళ్లీ రజనీకాంత్ చిత్రానికి కలసి పనిచేసే అవకాశం రాలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు మళ్లీ వీరిద్దరూ కలుస్తున్నారు.

మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా సంతోష్ ట్వీట్ చేస్తూ, ‘దళపతి తర్వాత మళ్లీ ఇప్పుడు రజనీ సార్ తో కలసి పనిచేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా వుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.