రొమాంటిక్ గా పూరే కొడుకు…!

Akash Puri Starrer Romantic Movie Launched

డైనమిక్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ అవతారం ఎత్తారు. ఆంధ్రాపోరీ, మెహబూబా అంటూ తన తనయుడిని హీరోగా లాంచ్‌ చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు పూరి జగన్నాథ్‌. అందుకే ఈ సారి పూరి జగన్నాథ్‌ కథను అందించి తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మరోసారి తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆకాశ్ పూరీ నెక్స్ట్ మూవీని లైన్‌లో పెట్టేశారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు నిర్మాతలు టైటిల్ ని ప్రకటించారు.

ఈరోజే సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం కాగా, హీరో కళ్యాణ్ రామ్, సీనియర్ నటి రమాప్రభ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చిత్రం తొలి సన్నివేశానికి హీరో కళ్యాణ్ రామ్ క్లాప్ కొట్టారు. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి జరుపుకుంటుంది. ఇందులో ఆకాష్ సరికొత్త లుక్ తో స్టైలిష్ గా కనిపించనున్నాడు. లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఈ బ్యానర్ నుంచి వస్తున్న రెండో సినిమా కాగా, మొదటి సినిమాగా రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.