ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ దేవగన్…!

Ajay Devgn Not Interested On SS Rajamouli RRR Movie

‘బాహుబలి’ సీరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా క్రేజే కాంబినేషన్ తో వస్తోందనేది అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రారంభం నుంచీ వార్తల్లో నిలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారనగానే చిత్రానికి భారీ హైప్ వచ్చింది. ఇప్పుడీ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా నటించనున్నారనే వార్త తాజాగా ప్రచారంలోకి రావడంతో చిత్రానికి మరింత హైప్ ఏర్పడుతోంది. దేవగన్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడని, పాత్ర చిన్నదే అయినా, అది అందరికీ గుర్తుండి పోయే పాత్ర ఆయనదని అంటున్నారు.

గతంలో రాజమౌళి తన ‘ఈగ’ చిత్రాన్ని హిందీలో అనువదించినప్పుడు ఆ సినిమాకి అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, ఆ కారణంగానే ఇందులో గెస్ట్ రోల్ చేయడానికి అజయ్ ముందుకు వచ్చాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఆయన ఎ షెడ్యూల్ లో షూట్ లో పాల్గొంటారు అనేది తెలియాల్సి ఉంది.