మళ్ళీ నయనతారనే…!

Nayanthara To Pair Up With Chiranjeevi Again

నయనతార తెలుగు, తమిళంలో స్టార్ హీరొయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోయిన్స్ సరసన నటించింది. ప్రస్తతం మెగా స్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో నటిస్తుండగా, అయన భార్య పాత్రలో నయనతార నటిస్తుంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఏప్రిల్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని, ఆగుస్ట్ 15నా సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆ తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే, ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలో కనిపిస్తాడు. ఓ సోషల్ ఓరియెంటెడ్ మెసేజ్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయకి కోసం చిత్రం బృందం పలువురు అగ్ర సినిమా హీరోయిన్స్ ని త్రిష, శ్రియ అనుష్క వంటి పేర్లను పరిశీలించింది కానీ అందులో ఎవ్వరు కూడా చిరంజీవికి తగిన జోడి కాదని భావించి మరల నయనతార నే తీసుకోవాలని చిత్రం బృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివతో సినిమాను రామ్ చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మించనున్నాడు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.