శింభు స్థానంలో సిద్దార్థ్…!

Siddharth Grand Son Role In Bharateeyudu2

2.ఓ చిత్రం విజయం తరువాత తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాని తెరకెక్కనున్నది. ఈ చిత్రం ఈ రోజునుండి చెన్నై పరిసర ప్రాంతలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనున్నది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. సేనాపతి మనవడి పాత్రలో తమిళ స్టార్ హీరో శింభు నటించనున్నాడన్నా సంగతి తెలిసిందే తాజాగా కోలీవుడ్ సమాచారం మేరకు కొన్ని అనివార్య కారణాల వలన శింభు భారతీయుడు 2 చిత్రం నుండి తప్పుకున్నట్లు సంచారం. అతని స్థానంలో బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ నటిస్తాడని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుండి అందుతున్న సమాచారం. కెరీర్ అరంభలో మంచి సినిమాలు చేసి అందరి చేత క్యూట్ అండ్ లవర్ బాయ్ గా పిలిపించుకున్న సిద్దార్థ్, ఆతరువాత తెలుగులో వరస పరాజయాలతో తమిళ సినిమా ఇండస్ట్రికి మకాం మార్చాడు.

అక్కడ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ హీరో గా రానిస్తున్నాడు. కానీ ఆయనకంటూ ఓ గుర్తింపు ఇంతవరకు అక్కడ రాలేదు. కానీ అనూహ్యంగా భారతీయుడు 2 చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలిసిన అవసరం ఉన్నది. ఇంకా ఈ చిత్రంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తాడు. ఈ చిత్రాని లైక ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాని నిర్మిస్తుంది. ఈ చిత్రాని మొత్తం ఎనిమిది దేశాలో షూటింగ్ జరపనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తాడు. ఈ చిత్రం 2020సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది.