నానితో జతకడుతున్న మేఘ ఆకాష్…!

Megha Akash To Act In Nani Movie

దేవదాస్ చిత్రం పరాజయం తరువాత నాని నటిస్తున్న సోలో మూవీ జెర్సీ. ఈ చిత్రాని గౌతం తిన్ననురి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే సగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన టిజర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. ఈ చిత్రంలో నాని ఆర్జున్ పాత్రలో ఓ ఓల్డ్ ఏజ్ క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఈ నేపద్యంలోనే నాని మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇష్టం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయినా విక్రం కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని నాని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నాని సరసన నటించే కథానాయకి కోసం అన్వేషణ జరుగుతుది.

సోషల్ మీడియాలో వస్తున్నా వార్తల నేపద్యంలో నాని సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు. కాని నాని అందులో ఒక్కరితోనే రొమాన్స్ చేయ్యనున్నాడు. ఈ ముగ్గురిలో లై, చల్ మోహన రంగ మూవీ ఫేమ్ మేఘ ఆకాష్ కథానాయకగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమె నటించిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యేసరికి ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. మరల నాని విక్రం కాంబినేషన్ లో రాబోయే సినిమాలో హీరొయిన్ కోసం విక్రం నుండి మేఘ కు పిలుపు వచ్చినట్లు సమాచారం. మరోసారి ఆమె నాని సినిమాతో అదృష్టం పంచుకోనున్నది. త్వరలోనే ఈ చిత్రంలో నటించే పాత్రలపై ఓ క్లారిటీ రానున్నది. ఈ చిత్రం ఫిభ్రవరి మూడోవ వారం నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది. నాని ప్రస్తుతం జెర్సీ సినిమా తో బిజీగా ఉన్నాడు.