రజినీ పెట్టా సినిమా విడుదల తేది ఫిక్స్…!

Petta Movie Switchivation In Telugu States

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ కథానాయకుడి గా రూపొందిన చిత్రం పెట్టా. త్రిష, సిమ్రాన్ కథానాయకలుగా నటిస్తున్నారు. పెట్టా మూవీ తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం విడుదలపై పలుఅనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా థియేటర్స్ సమస్య పెట్టా కు ఎదురుకానున్నది. కానీ ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి సినిమాను ఎలాగైనా సంక్రాంతి కి విడుధలచేయ్యలని నిర్మాత కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

రజినీకాంత్ నటించిన బాష చిత్రం సంక్రాంతి రోజు తెలుగులో విడుదలై చాలా పెద్ద విజయాని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చెయ్యాలని కళ్యాణ్ భావిస్తున్నాడు. అందుకే వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతికి చిత్రం విడుదలవుతుంది. రజినీకాంత్ నటించిన 2.౦ చిత్రం తరువాత వస్తున్న పెట్టా చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే తమిళంలోనూ ఈ చిత్రం పొంగల్ కానుకగా అజిత్ విశ్వాసం తో తలపడుతున్నాడు తలైవ రజినీకాంత్. ఈ చిత్రం తరువాత మురగదాస్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నాడు.