ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ఎక్కడ…!

Balakrishna Does Not Play A Role In NTR Biopic

క్రిష్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో రుపొందిన్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఈ చిత్రం నుండి ఇటివల ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటలోనే కొన్ని లక్షల మంది దీనిని వీక్షించారు. అలాగే ఈ చిత్రంలో నటించిన టాలీవుడ్ కు చెందినా స్టార్స్ ఎవరు ఎ పాత్రలో నటించారు అనే విషయం క్రిష్ వాళ్ళకు సంబందించిన పిక్స్ ను విడుదల చేసి సినిమా పై మంచి హైప్ తీసుకురాగలిగారు. ఎన్టీఆర్ పాత్రలో అయన కొడుకు నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రానా కనిపిస్తారు. అందాల తార శ్రీదేవి పాత్రలో రాకుల్ నటిస్తుంది.

ఇప్పటి వరకు అన్ని పిక్స్ ను చూపించిన క్రిష్ మాత్రం బాలకృష్ణ గెటప్ ను మాత్రం చూపించలేదు. బాల బాలకృష్ణ గా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కొడుకు నటించాడని ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల వేడుకలో బాలకృష్ణ తెలిపాడు. కానీ పెద్ద బాలకృష్ణ గా ఎవరు నటించారు అనే విషయం మాత్రం ట్రైలర్ లో ఎక్కడ చూపించలేదు. అసలు బాలకృష్ణ పాత్ర ఉంటదా లేదా అనే సందేహం మాత్రం అందరిలోనూ ఉన్నది. ఎన్టీఆర్ బయోపిక్ “కథానాయకుడు” సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలవుతుంది.