అఖిల్‌ కోసం మేఘా కూడా..!

Megha Akash to romance Akhil in Venky Atluri Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మూడవ సినిమా షూటింగ్‌ తాజాగా ప్రారంభం అయ్యింది. ‘తొలిప్రేమ’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఒక మంచి ప్రేమ కథతో ఈ చిత్రాన్ని వెంకీ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటి వరకు అఖిల్‌ నటించిన రెండు చిత్రాల్లో కూడా కొత్త హీరోయిన్స్‌ నటించారు. మొదటి చిత్రం ‘అఖిల్‌’లో సహేషా సైగల్‌ మరియు రెండవ చిత్రం ‘హలో’లో కళ్యాణి హీరోయిన్స్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మూడవ చిత్రంలో కొత్త హీరోయిన్‌ను కాకుండా ఇప్పటికే క్రేజ్‌ను దక్కించుకున్న హీరోయిన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

అఖిల్‌ మూడవ చిత్రంలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేయాలని మొదట భావించినట్లుగా వార్తలు వచ్చాయి. తొలిప్రేమ చిత్రంలో రాశిఖన్నా మంచి నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. అందుకే వెంకీ ఆమెను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నాగార్జున మరియు అఖిల్‌లు మాత్రం మేఘా ఆకాష్‌ను కూడా పరిశీలించాల్సిందిగా దర్శకుడికి సూచించినట్లుగా తెలుస్తోంది. నితిన్‌తో ‘లై’ మరియు ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రాలతో మేఘా ఆకాష్‌ మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. దాంతో ఆమెకు ఈ చిత్రంలో అవకాశం ఇవ్వాలని అక్కినేని వారు భావిస్తున్నారు. రాశిఖన్నా, మేఘలతో పాటు మరో స్టార్‌ హీరోయిన్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే హీరోయిన్‌ను ఫైనల్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం సక్సెస్‌ అఖిల్‌కు చాలా చాలా అవసరం. అందుకే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు కాస్త ఎక్కువ తీసుకుంటున్నారు.