‘ఛల్‌ మోహన్‌ రంగ’ ప్రివ్యూ

Chal Mohan Ranga movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నితిన్‌ 25వ చిత్రంగా తెరకెక్కిన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి పవన్‌ కళ్యాణ్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్రివిక్రమ్‌ ఈ చిత్రం నిర్మాణ భాగస్వామి అవ్వడంతో పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ నిర్వహించిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతటి అంచనాలున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అయ్యింది. నితిన్‌ గత చిత్రం ‘లై’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా ఆ చిత్రంలో తనకు జోడీగా నటించిన మేఘా ఆకాష్‌తో ఈ చిత్రంలో కూడా రొమాన్స్‌ చేయడం జరిగింది. ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్‌ అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రచయితగా మంచి గుర్తింపు దక్కించుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా, ఒక విభిన్న ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రంపై చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు సినీ వర్గాల వారు కూడా నమ్మకంగా ఉన్నారు. పవన్‌ పేరు ఈ సినిమాకు కోట్లు కురిపిస్తుందనే నమ్మకంను ట్రేడ్‌ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం కాస్త సాహసంతో కూడిన విషయమే. అయినా కూడా చిత్రంపై నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రాన్ని విడుదలకు సిద్దం చేశారు. నితిన్‌ లుక్‌తో పాటు, పాటలు మరియు కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.