‘రంగస్థలం’ ముందు రంగా నిలిచాడా?

nithin chal Mohan ranga movie collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘రంగస్థలం’ అంచనాలను అందుకుని సూపర్‌ హిట్‌ దిశగా దూసుకు పోతుంది. మొదటి వారంలో ఈ చిత్రం ఏకంగా 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో నితిన్‌ తన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రంగస్థలం జోరు మీదున్న ఈ సమయంలో నితిన్‌ సినిమా రావడం మంచిది కాదని మొదటి నుండి సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతూనే ఉన్నారు. అన్నట్లుగానే నేడు విడుదలైన నితిన్‌ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కలేదు.

మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ‘రంగస్థలం’ చిత్రాన్ని చూడాలనే ఆసక్తితో ఉన్నారు. ఆ కారణంగానే నితిన్‌ ఛల్‌ మోహన్‌ రంగ చిత్రంకు పెద్దగా కలెక్షన్స్‌ రావడం లేదు. పైగా నితిన్‌ సినిమా జస్ట్‌ ఓకే అనే టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో కలెక్షన్స్‌ మరింతగా తగ్గుముకం పడతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సినిమాకు కాస్త క్రేజ్‌ దక్కింది. కాని ఆ క్రేజ్‌ కలెక్షన్స్‌గా మారలేదు. వారం రోజుల్లోనే ఈ చిత్రం కనిపించకుండా పోవడం ఖాయం అని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.